Asianet News TeluguAsianet News Telugu

యూనివర్శల్ హెల్త్ కార్డులు: జగన్ బంపర్ ఆఫర్

తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి యూనివర్శల్ హెల్త్ కార్డులను అందిస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.
 

Ys jagan promises universal health cards to below rs 5 lakh income holders
Author
Amaravathi, First Published Apr 5, 2019, 6:16 PM IST

గుంటూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి యూనివర్శల్ హెల్త్ కార్డులను అందిస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.

శుక్రవారం నాడు గుంటూరులో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువగా ప్రజలకు సహాయాన్ని అందించే ఉద్దేశ్యంతో హెల్త్ కార్డుల స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఆసుపత్రిలో వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపచేయనున్నట్టు జగన్ ప్రకటించారు. ప్రతి నెల రూ. 40 వేల లోపు  ఆదాయం ఉన్న వారికి ఈ  ఈ స్కీమ్‌ను వర్తింపజేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.
 
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఉగాదిని పురస్కరించుకొని వైసీపీ మేనిఫెస్టోను  విజయవాడలో విడుదల చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హెల్త్ కార్డుల అంశం ప్రధానంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios