ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత  ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ జోరుగా ఎన్నికల ప్రచారాం సాగిస్తున్నారు. 

కాగా.. సెడన్ గా ఆయన మంగళవారం తన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల వ్యూహంపై ఆయన మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై చర్చిస్తారు. అలాగే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు జరిపిన ప్రచార సరళిపై ఆయన పార్టీ నేతలు మంతనాలు జరపనున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్క రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి.. పార్టీ నేతలకు తగు సూచనలు చేయనున్నట్లు సమాచారం. సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకు వెళ్లి.. అధికారం చేజిక్కుంచుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు.