తన ఐదేళ్ల పరిపాలన మీద చర్చ జరిగితే తనకు డిపాజిట్లు కూడా రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసునంటూ ఎద్దేవా చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. 

తన ఐదేళ్ల పరిపాలన మీద చర్చ జరిగితే తనకు డిపాజిట్లు కూడా రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసునంటూ ఎద్దేవా చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ను అంచనా వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచేస్తే.. నామినేషన్ పద్దతిలో సబ్‌ కాంట్రాక్టర్లను తీసుకొస్తున్నారని జగన్ ఆరోపించారు. దేవుడి కొండను కూడా తవ్వి దానిని కూడా అమ్ముకుంటున్నారని, వీరికి దేవుడన్నా భయం లేదని ఆయన చురకలు అంటించారు.

మన ఫెనిఫెస్టో రిలీజైన తర్వాత చంద్రబాబు టీడీపీ తరపున ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారన్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానిని చంద్రబాబు అమలు చేయలేదని జగన్ ఆరోపించారు.

ఆ మేనిఫెస్టోను కూడా టీడీపీ వెబ్‌సైట్ నుంచి తీసేశారన్నారు. మనం చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5తో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జగన్ శ్రేణులకు పిలుపునిచ్చారు.