ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫ్లైటుల్లో టిఫిన్‌ చేయడానికి తమిళనాడుకు, భోజనం చేయడానికి పశ్చిమ బెంగాల్, సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్ గాంధీ దగ్గరకి వెళతారంటూ సెటైర్లు వేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో రోడ్‌షొ నిర్వహించారు. అందరిని కలిసే చంద్రబాబు పక్కనే ఉన్న నవీన్ పట్నాయక్ దగ్గరకి మాత్రం వెళ్లరని ఎద్దేవా చేశారు.

ఝంఝావతి, వంశధార ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఒడిషా వెళ్లలేదని జగన్ విమర్శించారు. విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.