జనసేనను టీడీపీలో త్వరలో విలీనం చేస్తారని.. అదే పవన్  కి బెటర్ అని భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమరంలో శ్రీనివాస్ మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ వి ఊసరవెల్లి రాజకీయాలని విమర్శించారు. కేసీఆర్‌కే ఓట్లు వేస్తున్నామని నాగబాబు సోషల్ మీడియాలో పెట్టలేదా? అని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యభిచారం అన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జనసేనను టీడీపీలో కలిపేయడం ఉత్తమం అని నిప్పులు చెరిగారు.