ఏపీలో ఎన్నికలు రోజు రోజుకీ హీట్ పెంచుతున్నాయి. టికెట్ దక్కిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 


ఏపీలో ఎన్నికలు రోజు రోజుకీ హీట్ పెంచుతున్నాయి. టికెట్ దక్కిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో.. ప్రత్యర్థులపై విమర్శలు.. ప్రతి విమర్శలు కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. కాగా... ప్రస్తుతం వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్క కనుసైగ చేస్తే చాలు ఒక్కరు కూడా మిగలరని అనిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చంపడమో?చావడమో?..విజయమో.? వీరస్వర్గమో? అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాల్సిందేనని అనిల్‌ కుమార్‌ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. 

కాగా.. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు తాగి ఊగినట్లున్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అది మార్ఫింగ్ వీడియో అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజా వ్యవహారంపై అనిల్ ఎలా స్పందిస్తారో చూడాలి.