రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ ని చిత్తుగా ఓడించాలని టీడీపీ నేత వంగవీటి రాధా అన్నారు. ఆయన టీడీపీ అభ్యర్థుల తరపున కృష్ణి జిల్లాలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలన్నారు. ఆ భయంతో ఆయన హైదరాబాద్ పారిపోయేలా చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో గెలిపిస్తే ఓట్లు వేసారా లేదా అని చూసి మాట్లాడే వలస నాయకుడు జోగి కి ఈ సారి బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఓటమి జగన్ చిరస్థాయిగా గుర్తుండిపోవాలన్నారు. గెలుపు కోసం సుదూరం నుంచి వచ్చిన మరో వలస నాయకుడు బాలశౌరిని తిప్పి పంపాలన్నారు.  నిత్యం అందుబాటులో ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తున్న టీడీపీ నేతలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

రాష్ర్ట గౌరవాన్ని తాకట్టు పెట్టి, అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్‌కు తన స్వప్రయోజనాల కోసం కేంద్రంతోను, కేసీఆర్‌తోను చేతులు కలిపారన్నారు. ప్రజా సమస్య లపై పోరాడాల్సిన పార్టీ అసెంబ్లీకి, పార్లమెం టుకు వెన్నుచూపి, ప్రజలను మోసం చేసిందన్నారు. క్రిమినల్‌ జగన్‌కు ఓటు వేస్తే, రాష్ట్రం పరిస్థితి ఏలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు.