వైసీపీ అధినేత జగన్ సభలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగన్ గుంటూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. 


వైసీపీ అధినేత జగన్ సభలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగన్ గుంటూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఐలాండ్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ సభకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగిపడటంతో 10మందికి షాక్ తగిలింది. వీరిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన వారంతా క్షేమంగానే ఉన్నారు. అప్రమత్తమైన కార్యకర్తలు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.