శ్రీకాకుళం వైసీపీ లోక్ సభ అభ్యర్థి దువ్వాడ శ్రీను.. ఎన్నికల ప్రచారంలో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం జగన్ శ్రీకాకుళం జిల్లా పలాస ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఆయనతోపాటు ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ నేత దువ్వాడ శ్రీను.. భావోద్వేగానికి గురయ్యారు. 

18ఏళ్ల నుంచి తాన రాజకీయాల్లో ఉన్నానని.. ఆర్థికంగా చితికిపోయానని ఆయన అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాపారాలను అష్టదిగ్భంధనం చేశారని ఆరోపించారు. అలాంటి తనకు జగన్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. జగన్ చేసిన మేలుకి తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ఆయన అన్నారు. 

చంద్రబాబు డబ్బులు ఉన్నవారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని శ్రీను ఆరోపించారు. కానీ జగన్ మాత్రం తనకు జనం మద్దతు ఉందని.. తన దగ్గర డబ్బు లేకపోయినా టికెట్ ఇచ్చారన్నారు.