గుడివాడ : గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఓట్లు అడిగే హక్కు కొడాలి నానికి లేదన్నారు. 

గుడివాడలో టీడీపీ కార్యాయలంలో మాట్లాడిన ఆమె రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయం సాధించడం తథ్యమన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల మద్దతుతో చంద్రబాబు అధికారంలో రావడం ఖాయమన్నారు. 

గుడివాడకు పదిహేనేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కొడాలి నాని ఏనాడైనా నియోజకవర్గ సమస్యలపై చర్చించారా అని నిలదీశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించారా అంటూ నిలదీశారు. 

తెలుగుదేశం టికెట్ పై రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబును విమర్శించడం సిగ్గు చేటన్నారు. కొడాలి నాని కుసంస్కారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అభివృద్ధి చేసి తానేంటో నిరూపించుకోవాల్సింది పోయి అర్థంపర్ధంలేని మాటలు మాట్లాడుతూ కులాల నడుమ చిచ్చు రేపడం సరైంది కాదని వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి సాధినేని యామిని హితవు పలికారు.