రాజమండ్రి: యూటర్న్ బాబు పరిస్థితి బాహుబలి సినిమాలో భల్లాల దేవ్ మాదిరిగా మారిందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.

రాజమండ్రిలో సోమవారం నాడు నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు పద్దతి అని ఆయన ఆరోపించారు.రెండేళ్ల క్రితం చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో... ఇప్పుడు బాబు ఏం చెబుతున్నారో ఆలోచించాలని ఆయన  కోరారు. చంద్రబాబునాయుడు తాను చేయలేని పనులను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 హెరిటేజ్ సంస్థను కాపాడుకోవడం కోసమే చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.సేవామిత్ర యాప్ ద్వారా కొందరి నుండి సేకరించిన సమాచారాన్ని దొంగిలిసున్నారని బాబుపై మోడీ విమర్శించారు.

డేటా దొంగలు  ఇంకా ఏం చేస్తారో మీరే ఆలోచించుకోవాలని  ఆయన విమర్శించారు. దేశంలోని ప్రజల సంక్షేమం కానీ ఇతర విషయాల గురించి కానీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు శ్రద్ధ లేదని ఆయన చెప్పారు.

ఈ ఐదేళ్లలో తాను ప్రధానమంత్రిగా చేసిన పనులను ఒక్కసారి చూడాలని ఆయన కోరారు. ఏపీతో పాటు దేశంలో కూడ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

ఏపీ సర్కార్‌కు పోలవరం ఏటీఎం లాంటిది: మోడీ