విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం డెంకాడలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది. వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రచార రథంపై ప్రజలనుద్దేశించి ప్రసంగిచారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.

అయితే అక్కడికి కొద్దిదూరంలో ఓ మిద్దెపై నుంచి ఇటుకలు పడి నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.