జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి వార్నింగ్ ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ.. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని అనిల్ చాలా సార్లు మీడియాలో ప్రస్తావించారు. రాజకీయపరంగా పవన్ ని విమర్శించాడు కూడా. కాగా.. ఈ ఘటనపై పవన్ తాజాగా స్పందించారు.

"అనీల్ కుమార్ యాదవ్ నా అభిమాని అని చెప్తాడు. రెండు మూడు సార్లు కలిశాడు. నువ్వు బెట్టింగులు మానేసి.. నా అభిమాని అని చెప్పు" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో నేతలు ఎక్కువగా బెట్టింగులు కాస్తుండటంపై పవన్ ఈ విధంగా స్పందించారు.

అనంతరం నెల్లూరులోని నేతల గురించి మాట్లాడుతూ..‘‘నెల్లూరులో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలా బెట్టింగ్ ఎక్స్పర్ట్‌లా? జెండా ఏ వైపు ఎగురుతాది అనే వాటి పైన కూడా బెట్టింగులు ఆడుతారు వీళ్లు. మీకెందుకు రాజకీయాలు క్లబ్బుల్లో కూర్చుని పేకాట, బెట్టింగులు ఆడుకోండి. పోలీసులపైన కూడా మీరు రౌడీయిజం చేస్తారా?’’ అని ప్రశ్నించారు. 

నెల్లూరు నుంచి పోటీకి దిగిన తమ జనసేన అభ్యర్థులు మాత్రం బెట్టింగులకు పాల్పడరని.. కేవలం ప్రజల  శ్రేయస్సు కోసం పోరాడతారని వివరించారు.