తణుకు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ సీఎం అయితే అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్తున్నాడని ఆయన మాటలు నమ్మెుద్దని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. 

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తారని అనడం అసత్యమన్నారు. 

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దోచుకున్న వ్యక్తి ఏకంగా సీఎం అయితే ఇంకేమైనా ఉందా అని నిలదీశారు. వైఎస్ జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు జైళ్లపాలయ్యారని పవన్ ఆరోపించారు. 

మరోవైపు జగన్ సీఎం అయిన తర్వాత ప్రతీ ఇంటిలో తన ఫోటో ఉండాలన్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రతీ ఇంటిలో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు ఉండాలో చెప్పాలని నిలదీశారు. వైఎస్ జగన్ ఏమైనా మహాత్మగాంధీయా లేక డా.బి.ఆర్ అంబేద్కర్ చెప్పాలని ప్రశ్నించారు. 

ఎంతసేపు ముఖ్యమంత్రి కావాలనే ధ్యాసతప్ప ఏనాడైనా ప్రజల కోసం పనిచేశారా అంటూ ప్రశ్నించారు. సీఎం పదవి మీ కుటుంబాల సొత్తు కాదని పవన్ వ్యాఖ్యానించారు. ఎంతసేపు మీ బానిసల్లా తాము బతకాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పల్లకీలు మోసి మోసి అలసిపోయామని తాము పల్లకీ ఎక్కే సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేను మగాడ్ని: జగన్, చంద్రబాబులపై విరుచుకుపడిన పవన్