తాను కనుక ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి ముఖ్యమంత్రి అయితే.. తొలి సంతకం రైతుల  పెన్షన్ పైనే చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం విశాఖ జిల్లాలోని గిద్దలూరులో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల హామీల వర్షం కురిపించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తానని చెప్పారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 18నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.