మదనపల్లె: సైకిల్ పాతపడిపోయింది... కేసీఆర్ సైకిల్‌ చైన్‌ను తెంచేశారని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  టీడీపీపై విరుచుకుపడ్డారు. రాజకీయాలు  రెండు కుటుంబాలకేనా అని జగన్ , చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గురువారం నాడు చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.  వైసీపీని చూస్తే టీడీపీ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ అన్నారు.

తాను ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగా చెబుతానన్నాను. జగన్ మాదిరిగా వెళ్లి మోడీ కాళ్లు పట్టుకోనని ఆయన విమర్శించారు. శాసనసభకు వెళ్లని ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.