జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేకపోవడంతో.. పార్టీ స్టార్ క్యాంపైనర్ గా ఆయనొక్కరే వ్యవహరిస్తున్నారు. ప్రతి జిల్లాలో పర్యటిస్తూ.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ నెల్లూరు జిల్లా కొవ్వూరులో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు.  రెండు కుటుంబాల మధ్యే రాజకీయం నడవొద్దన్నారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందన్నారు.

 రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని చెప్పారు. రాజకీయం అంటే బెట్టింగ్‌ అయిపోయిందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. పెద్ద కుటుంబం అయితే 10 సిలిండర్లు ఇస్తామని స్పష్టంచేశారు.

6నెలల్లో 3లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష మంది కొత్త రైతులను తయారు చేస్తామన్నారు. మత్స్య కారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో రోజుకి రూ.500 ఇస్తాం అని చెప్పారు.