మెగా డాటర్ నిహారిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇటీవల సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇప్పుడు తన తండ్రి గెలుపు కోసం కృషి చేస్తోంది

నాగబాబు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా నిహారిక మంగళవారం నియోజకవర్గంలో తన తండ్రితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. పశ్చిమగోదావరి జిల్లాతో మెగా కుటుంబానికి అనుబంధం ఉందని.. ఈ జిల్లా సొంత ప్రాంతమని.. ఇక్కడి ప్రజలు తన తండ్రిని గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు . 

భీమవరంలో బాబాయి పవన్ కళ్యాణ్‌ను, నర్సాపురం ఎంపీగా తండ్రి నాగబాబును.. మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేవలం నాగబాబు మాత్రమే కాదు.. నాగబాబు గెలుపు కోసం జబర్దస్త్ నటీనటులు కూడా ప్రచారం చేస్తుండటం విశేషం.