ఏపీ మంత్రి లోకేష్.. మరోసారి ఇరకాటంలో పడ్డారు. బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. పొరపాటున తమ పార్టీని తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలను నెట్టింట షేర్ చేసి.. ట్రోల్స్ కూడా చేశారు. తాజాగా.. మరో సారి నోరు జారి.. లోకేష్ ఇరుకునపడ్డాడు.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ తడబడ్డారు. 

మంగళగిరిలో ప్రచారం చేస్తున్న లోకేశ్‌ ఆదివారం రోడ్‌ షోలో మాట్లాడుతూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వివేకా మరణంపై మాట్లాడుతూ.. ‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి..’’ అంటూ ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

వివేకానంద రెడ్డి చనిపోతే.. పరవశిస్తారా..? మీ మనసులో మాట బయటపెట్టారుగా అంటూ.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.