నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారంలో నందమూరి వారసులు కలిసొస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీకి సినీనటులు ప్రచారం చేస్తున్నారు. 

అయితే తెలుగుదేశం పార్టీకి కేవలం దివ్యవాణి మినహా ఎవరూ కనిపించడం లేదు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడే స్టార్ కాంపైనర్ గా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో నందమూరి హీరోలు ఎవరైనా పాల్గొంటారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

తాజాగా నందమూరి హీరో తారకరత్న ఎన్నికల ప్రచారంలోకి దిగారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి మాజీమేయర్ అబ్దుల్ అజీజ్ కు మద్దతుగా పర్యటించారు. నెల్లూరు రూరల్ వేదాయపాళెం నుంచి గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. నందమూరి మీరో తారకరత్న ఎంట్రీతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో సరికొత్త జోష్ నెలకొంది.