ఎలాంటి పరిపాలనా అనుభవం లేని వ్యక్తికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తే యాక్సిడెంట్‌లు అవుతాయన్నారు మంత్రి నారాలోకేశ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు.

వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభవృద్ధి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. సైబరాబాద్ తరహాలో మంగళగిరిలో ఐటీ పరిశ్రమను విస్తారింపజేస్తానని ఆయన తెలిపారు.

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీని నిలదీసిన ఏకైక వ్యక్తి గల్లా జయదేవ్ ‌అని ఆయనకు మరోసారి ఓటేయ్యాలని లోకేశ్ అభ్యర్ధించారు. ప్రధానిని ప్రశ్నించినందుకు జయదేవ్‌తో పాటు ఆయన బావమరిది, హీరో మహేశ్ బాబు పైనా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.