టీడీపీ మంగళగిరి టికెట్.. లోకేష్ కి కేటాయించినప్పటి నుంచి.. ఆయన నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలను ఓట్లు అభ్యర్థించడానికి ఆయన చేస్తున్న ప్రచారం.. పార్టీకి ఉపయోగపడాల్సింది పోయి.. రివర్స్ అవుతోంది. 

ప్రచారంలో లోకేష్ మాట్లాడిన ప్రతిసారీ.. ఏదో ఒక మిస్టేక్ చేస్తూ వస్తున్నారు. మొన్నటి కి మొన్న వివేకా మృతి విని పరవశించిపోయాం అన్నారు. దాని మీద ట్రోల్స్ తగ్గకముందే.. మంగళగగిరి నియోజకవర్గాన్ని మందలగిరి చేశారు. నియోజకవర్గం పేరు కూడా గుర్తుంచుకోకపోతే.. ఎలా అంటూ.. కామెంట్స్ కూడా వినిపించాయి.

ఇప్పుడు తాజాగా.. ఆయన పోలింగ్ జరిగే తేదీని కూడా మర్చిపోయారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతుండగా.. ఏప్రిల్ 9వ తేదీన ఓటు వేయమని ఆయన కోరుతుండటం విశేషం. కాగా.. ఆయన పొరపాటున చేసిన కామెంట్స్ ని ప్రతిపక్ష పార్టీ నేత తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

లోకేష్‌ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్‌ కవర్‌ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. 

దీనిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. 'నారా లోకేశ్‌ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి' అని సెటైర్‌ వేశారు.

                                  "