వైసీపీ అధినేత జగన్ చెల్లెలు, ఆ పార్టీ మహిళా నేత షర్మిలపై మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ సెటైర్లు వేశారు. లోకేష్ ని టార్గెట్ చేస్తూ.. మంగళగిరిలో బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. బస్సు యాత్రలో షర్మిల చేసిన కామెంట్స్ కి  లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

‘‘అబ్బబ్బబా! పైకి బీజేపీతో 'పొత్తు నహీ' అంటారు, జనాలు రాని బీజేపీ సభకి తమ కార్యకర్తలని పంపించి 'హమ్ హై నా' అని భరోసా ఇస్తారు... 
మళ్లీ సింహం సింగల్ అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు ! జనాలు మీ 'సింహం' కామెడీ చూసి నవ్వుకుంటున్నారు’’ అంటూ షర్మిలను ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు. 

అదేవిధంగా టీఆర్ఎస్, బీజీపీలతో వైసీపీ పొత్తునుతెలియజేసే కొన్ని ఫోటోలను ఆ ట్వీట్ కి  లోకేష్ అటాచ్ చేశారు.