వైసీపీ కార్యకర్తలకు జేపీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. జేసీ.. వైసీపీ నేతలకు క్షమాపణలు చెప్పడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే.. ఆయన నిజంగానే క్షమాపణలు చెప్పారు.

ఆయన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలిపారు. ఈ సంగటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల లో చోటుచేసుకుంది. ఎల్లుట్లలో వైసీపీ కార్యకర్తల బైక్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి కాన్వాయ్‌ ఢీకొట్టింది. 

గమనించిన జేసీ ప్రభాకర్‌‌రెడ్డి వెంటనే వారి వద్దకు వచ్చి క్షమాపణ చెప్పారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడిపత్రి నుంచి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరపున ప్రచారానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.