రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికారం రెండు వర్గాల మధ్యే నలుగుతోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో జరిగిన సభలో ప్రసంగించారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి గానీ అభివృద్ధి చేయలేదని పవన్ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో 60 శాతం ఓట్లు అచ్చెన్నాయుడు తీసుకుంటే.. మిగిలిన 40 శాతం ధర్మాన ప్రసాదరావు ఖాతాలోకి వెళ్తున్నాయని జనసేనాని ధ్వజమెత్తారు.  

అల్లరి చిల్లరగా ఉన్న వాళ్ల వల్లే ఉత్తరాంధ్ర వెనుకబడిందని... ఈ ప్రాంతంలో జనసేనకు సీట్లు రాకపోతే పోరాటం చేసే వాళ్లు ఉండరని పవన్ తెలిపారు. కుటుంబ పాలనలో నలిగిపోతున్న శ్రీకాకుళాన్ని రక్షించాలనే తపనతో చదువుకున్న అభ్యర్థులను పోటీలో ఉంచానని వారిని గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.