శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. నేరుగా బాబాయ్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నారు.

హైదరాబాద్: బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం తెలుగు సినిమా హీరో రామ్ చరణ్ తేజ్ ప్రచారంలోకి దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురై ప్రచారానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో జనసేన తరఫున ప్రచారం చేయడానికి రామ్ చరణ్ రంగంలోకి దిగారు. 

శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. నేరుగా బాబాయ్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నారు.

బాబాయ్‌ వెంట రెండు రోజుల పాటు చెర్రీ ఉంటారు. పవన్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా రామ్‌చరణ్ పాల్గొంటారు. కాగా, నాగబాబు తరఫున కూడా రామ్‌చరణ్ ప్రచారం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనడంతో పాటు చెర్రీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. 

వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబు తరఫున ప్రచారం చేశారు. నిహారిక కూడా ప్రచారం చేసింది. అల్లు అర్జున్ మాత్రం తాను ప్రచారానికి రాకపోయినా నాగబాబు, పవన్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.