కడప: కాంగ్రెస్ పార్టీ తనను సీఎం చేస్తే రూ.1500 కోట్లు ఇచ్చేందుకు  తాను సిద్దమని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తనకు చెప్పారని నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. 

కడపలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో నేషనల్ కాన్పరెన్స్  అధినేత ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు.ఇంత సొమ్ము ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడ రాష్ట్రం గురించే ఆలోచిస్తారని ఆయన గుర్తు చేసుకొన్నారు

ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏం తింటున్నా మనమంతా భారతీయులమేనని నేషనల్ కాన్పరెన్స్ చీఫ్  ఫరూక్ అబ్దుల్లా  అభిప్రాయపడ్డారు. దేశమంతా ఏకమై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇప్పుడు రోజులు మారిపోయాయని చెప్పారు.

స్వతంత్రపోరాటంలో కులాలు, మతాలకు అతీతంగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరు ముస్లింలు, ఎవరు దళితులంటూ రాజకీయాలు నడుపుతున్నారని ఫరూక్ అబ్దుల్లా విమర్శలు చేస్తున్నారన్నారు.

ఆఖరికి తీవ్రవాదాన్ని, దేశ భద్రతను కూడ రాజకీయం చేస్తున్నారని ఆయన పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమది సరిహద్దు రాష్ట్రమన్నారు. తీవ్రవాదం,  పాకిస్తాన్ ఏమిటో తమకు తెలుసునని ఆయన చెప్పారు. 

ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామ మందిరం గుర్తొస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.అయితే రామమందిరం గురించి ఈ ఐదేళ్లు ఎందుకు బీజేపీ ప్రస్తావించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.