కోడికత్తి పార్టీకి ప్రజా సమస్యలు పట్టవని ఏపీ మంత్రి దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు.
కోడికత్తి పార్టీకి ప్రజా సమస్యలు పట్టవని ఏపీ మంత్రి దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు. అసలు అసెంబ్లీకే రానివాళ్లకు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయంటూ.. జగన్ ని ఉద్దేశించి దేవినేని సెటైర్లు వేశారు.
గుడివాడ నియోజకవర్గంలో దేవినేని ఉమ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టిసీమను నిర్మించి చరిత్ర సృష్టించామని, దీంతో దాదాపు 44 వేల కోట్ల మేరకు రైతులకు లబ్ధి చేకూరిందని ఉమ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కోడికత్తి పార్టీ డ్రామాలు చేస్తోందన్నారు.కేసీఆర్ తో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
