జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన జనసేన ఎన్నికల ప్రచారంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. 

పాలకొల్లు: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన జనసేన ఎన్నికల ప్రచారంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు.

మంగళవారం నాడు ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజున మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్ ఒకే వేదికను పంచుకొన్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సమయంలో మెగా హీరో రామ్ చరణ్ ఆయనను పరామర్శించారు. రామ్ చరణ్ కూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరిగినా కూడ ఆయన జనసేన తరపున ప్రచారం నిర్వహించలేదు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో పాలకొల్లు అసెంబ్లీ నుండి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే ఎన్నికల్లో తిరుపతి నుండి మాత్రం ఆయన విజయం సాధించారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా నాగబాబు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.