పాయకరావుపేట: ముఖ్యమంత్రి పదవి ఒక్కసారి ఇవ్వడానికి  అదేమైనా చాక్లెట్టా.... బొమ్మనా అంటూ  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ నేత జగన్‌పై సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి మీకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు.

ఆదివారం నాడు ఆయన విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.  జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కోరుతున్నారని బాబు గుర్తు చేశారు.

ఒక్కసారి జగన్‌కు సీఎం పదవిని ఇస్తే రాష్ట్రాన్ని ముంచుతాడని చంద్రబాబునాయుడు విమర్శించారు. షర్మిలకు అన్నపై, విజయమ్మపై కొడుకుపై ప్రేమ ఉండడంలో తప్పు లేదన్నారు. కానీ మీ ప్రేమ కోసం రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి పెట్టాలా అని బాబు ప్రశ్నించారు.  జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారో చెప్పగలరా అని  ఆయన ప్రశ్నించారు.

సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్‌కు నాకు తగాదా ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చాడని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల కోసం తాను కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ ఏపీ ప్రజలను ఏ రకంగా ఏ రకంగా తిట్టారో చంద్రబాబు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

ఓటమి భయం పట్టుకొంది, నాకు జగన్ సమ ఉజ్జీ కాడు: చంద్రబాబు