అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమలకు బయలుదేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి తిరుమలకు బయలుదేరారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లారు

చంద్రబాబు తిరుపతి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హారతి ఇచ్చారు. ఎదురుగా వచ్చి కొబ్బరికాయతో దిష్టితీశారు. 

తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత అక్కడినుంచి నేరుగా శ్రీకాకుళం వెళతారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు అక్కడినుంచి కొనసాగిస్తారు.