నంద్యాల: నంద్యాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.  కొన్ని కారణాలతో ఎస్పీవై రెడ్డి కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వలేకపోయినట్టు బాబు చెప్పారు.

బుధవారం నాడు కర్నూల్ జిల్లా నంద్యాలలో నిర్వహించిన  టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.  ఎస్పీవై రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగిందన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆయన ఎస్పీవై రెడ్డి కుటుంబానికి బహిరంగంగా కోరారు.  ఎస్పీవై రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకొంటామని ప్రకటించారు.

టీడీపీ టిక్కెట్టు దక్కని కారణంగానే  ఎస్పీవై రెడ్డి జనసేన నుండి నంద్యాల ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఎస్పీవై రెడ్డి నామినేషన్ ఉప సంహరించుకొంటారని ప్రచారం సాగుతున్న తరుణంలో బాబు  చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.భూమా బ్రహ్మనందరెడ్డి బాగా పనిచేస్తారని ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే  టిక్కెట్టు ఇచ్చినట్టు ఆయన వివరించారు.