Asianet News TeluguAsianet News Telugu

పసుపు- కుంకుమ ఇచ్చే వ్యక్తి కావాలా, పసుపు-కుంకాలు తుడిచే వ్యక్తి కావాలా: లోకేశ్

తుఫాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 గంటలు మకాం వేసి తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారన్నారు మంత్రి నారా లోకేశ్. 

AP Minister nara lokesh speech in srikakulam road show
Author
Srikakulam, First Published Mar 26, 2019, 12:30 PM IST

తుఫాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 గంటలు మకాం వేసి తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారన్నారు మంత్రి నారా లోకేశ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన శ్రీకాకుళంలో రోడ్‌షోలో పాల్గొన్నారు.

తిత్లీ తుఫాను సమయంలో ప్రతిపక్షానికి చెందిన ఒక్క నేత కూడా బాధితులను పరామర్శించడానికి రాలేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. లోటు బడ్జెట్‌‌లో ఉన్నా ప్రజలకు ఏ మాత్రం లోటు లేకుండా ముఖ్యమంత్రి చూసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

రెండో చెక్ చెల్లడం లేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారని కానీ అది అవాస్తమని లోకేశ్ ఎద్దేవా చేశారు. పసుపు కుంకుమ మీకు అందించిన వ్యక్తి కావాలా.. పసుపు-కుంకాలు చేరిపివేసే వ్యక్తి కావాలా అని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే 24 గంటల పాటు కరెంట్ సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని లోకేశ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios