ప్రభుత్వ సంస్థల దగ్గర ఉండవలసిన అంశాలు, ప్రైవేటు సంస్థల ఉండటానికి వీల్లేదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.  విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ గ్రిడ్ వద్ద అటువంటి సమాచారం ఉన్నట్లు తాను గుర్తించానన్నారు.

తన వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలకు ఇబ్బంది వస్తుందని హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబుతో పాటు మంత్రుల హడావిడి చూస్తుంటే ఇవన్నీ వాస్తవాలేనన్న విషయం తేట తెల్లమవుతుందని బొత్స స్పష్టం చేశారు.

ఇంటిగ్రేటెడ్ సీఈవో అశోక్‌ టీడీపీ అధికారిక కార్యక్రమాల్లో ఉన్నట్లు ఫోటోల్లో స్పష్టం ఉన్నట్లు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. సేవామిత్ర అనే యాప్ తయారు చేసింది ఐటీ గ్రిడ్ అనే సంస్థే తయారు చేసిందని.. పార్టీ తాలుకూ అంశాలతో ఉండాల్సిన యాప్‌లోకి ఓటరు జాబితాలు ఎందుకు వచ్చాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

విజయనగరంలో ట్యాబ్‌ను పట్టుకున్నప్పుడు ఓటరు లిస్టు ఉందని తాము ఆధారాలతో సహా చెప్పినప్పుడు.. టీడీపీ నేతలు బుకాయించారన్నారు. ఓటర్ల లిస్టు ఎన్నికల కమీషన్ ఇచ్చిందే కదా అన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

జనవరి 11 తర్వాత ఒక్క ఓటు తొలగించలేదు: ద్వివేది

టీడీపీ అధికారిక వెబ్ సైట్ క్లోజ్.. కారణం అదేనా..?

కేంద్రం, తెలంగాణ సర్కార్లు టెర్రరిస్టులు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు