దేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణ నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని.. ఇరు దేశాలకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు.

ఇటీవల పుల్వామాలో భారత సైనికులపై పాక్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడిలో 43మంది  భారత జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా.. పాక్ స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్.. పాక్ చెరలో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ఈ ఘటనలపై పవన్ స్పందించారు.

యుద్ధం జరిగితే.. ఇరు దేశాలకు నష్టం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందన్నారు. 40మందికిపైగా భారత జవాన్లు అమరులవ్వడం బాధాకరమన్నారు. మన పైలెట్ పాకిస్థాన్ సైన్యానికి దొరకడం కలవపాటుకు గురిచేసిందన్నారు. అభినందన్ క్షేమంగా స్వదేశానికి రావాలని ఆకాంక్షించారు. జెనీవా నిబంధనలను  పాక్ పాటించాలని కోరారు.