ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ని ప్రజల డేటా లీకయ్యిందనే వార్త కలకలం సృష్టించిన సంగతి తెలసిందే. కాగా.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే ఈ డేటాని చోరీ చేసి.. దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరో వైపు దీనిపై తెలంగాణలో దీనిపై కేసులు కూడా పెట్టారు. అయితే.. ఇదంతా జగన్ ఆడుతున్న నాటకమని.. డేటా దొంగలించింది జగనేనని మంత్రి లోకేష్ పేర్కొంటున్నారు. 

ఈ మేరకు తన ట్విట్టర్ లో లోకేష్ సాక్ష్యాలు పొందుపరిచారు. వైసీపీ పార్టీ నుంచి ప్రజలకు కొందరు వ్యక్తులు కాల్స్ చేస్తున్నారంటూ.. లోకేష్ అన్నారు. ఈ మేరకు రెండు ఆడియో క్లిప్స్ ని కూడా తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

‘హైద‌రాబాద్ వైకాపా కాల్ సెంట‌ర్ నుంచే APలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌లోభాల‌కు  గురిచేసే కాల్స్ చేస్తున్నారు. ఇది చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ కింద‌కు రాదా? ఇన్ని  అక్ర‌మాలు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతున్నాయి.’ అని లోకేష్ పేర్కొన్నారు.‘‘మరి దీని పై TS ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? జగన్, @ktrtrs జోడి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?’’ అంటూ మరో ట్వీట్ చేశారు.

లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలను ఈ కింది రెండు ట్వీట్స్ లో వినగలరు.