విజయనగరంలో వైసీపీకి షాక్..

YSRP Leader Satrucharla Chandrasekhar Raju joins in  TDP today
Highlights

టీడీపీలో చేరిన వైసీపీ కీలకనేత శత్రుచర్ల

విజయనగరం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని  షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు.. వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్వతీపురంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రశేఖరరాజుకు లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరరాజు ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మామయ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చంద్రశేఖరరాజుకు పేరుంది. వైసీపీ స్థాపించిన తరువాత జిల్లాలో ప్రప్రథమంగా జగన్‌కి మద్దతు తెలిపిన వ్యక్తి చంద్రశేఖరరాజే కావడం విశేషం.

చంద్రశేఖర్.. టీడీపీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. కాగా.. గురువారం అధికారికంగా ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader