అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్రలో  అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. గతంలో ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టు ఉండేది.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్రరాంధ్రలో వైసీపీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఇదే పరిస్థితి నెలకొంది.

ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పాలకొండ, పలాస మున్సిపాలిటీల్లో వైసీపీ గెలుపొందింది.

విజయనగరం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో వైసీపీ కైవసం చేసుకొంది. ఈ జిల్లాలోని బొబ్బిలి మున్సిపాలిటీలోనే టీడీపీ కొంత వైసీపీకి పోటి ఇచ్చింది. మాజీ మంత్రి సుజయకృష్ణరంగారావు, ఆయన సోదరుడు విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయని  టీడీపీ నేతలు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలోని విశాఖ కార్పోరేషన్ ను వైసీపీ కైవసం చేసుకొంది. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలను  వైసీపీ గెలిచింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ మెరుగైన ఫలితాలను దక్కించుకొంది. వైసీపీకి టీడీపీ గట్టి పోటి ఇచ్చింది.