మహిళలు అందునా ఖాళీ బిందెలతో వచ్చిన నిరసన తెలిపడంతో పోలీసుల్లోనూ కంగారు మొదలైంది. దీంతో నిరసనకు నాయకత్వం వహిస్తున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు.

ఎదైనా కాస్త వెరైటీగా చేస్తేనే పదిమందికి తెలుస్తోంది. ప్రచారంలోకి వస్తుంది. పని పూర్తి అవుతుంది. అందుకే తెలివైన నాయకుడు ప్రభుత్వాన్ని కదలించాలంటే భిన్నంగానే ప్రతిస్పందిస్తుంటాడు.

ఇంతకీ విషయం ఎంటేంటే.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట‍్టణంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులకు మొరపెట్టుకున్నా వారు లైట్ తీసుకుంటున్నారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల‍్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ప్రజలతో కలిసి బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసనకు దిగారు.

మహిళలు అందునా ఖాళీ బిందెలతో వచ్చిన నిరసన తెలిపడంతో పోలీసుల్లోనూ కంగారు మొదలైంది. దీంతో నిరసనకు నాయకత్వం వహిస్తున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు.

అయితే ఆయన సోమవారం ఉదయం తన అనుచరులతో వచ్చి మళ్లీ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట జలదీక్ష మొదలుపెట్టారు. కానీ, దీక్ష ప్రారంభించిన కాసేపటికే కంగారెత్తిన పోలీసులు మళ్లీ ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు.

( ఫొటో క్రెడిట్ : నల్లు సంజీవ్ కుమార్)