ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. అనంతపురం నేత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా రెండోసారి ఛాన్స్ ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. అనంతపురం నేత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా రెండోసారి ఛాన్స్ ఇచ్చింది.

చిత్తూరు జిల్లా నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం కల్పించింది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడికి మండలిలో ఛాన్స్ ఇచ్చింది.

కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడు చల్లా భగీరథ రెడ్డికి అవకాశం ఇచ్చింది. విజయవాడ నుంచి కార్పోరేటర్ మహ్మద్ కరీమున్నీసాకు ఛాన్స్ ఇచ్చింది.

విజయవాడ సెంట్రల్‌లో 56వ కార్పోరేటర్‌గా పనిచేశారు కరీమున్నీసా. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు, సీనియర్ నేత సీ. రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది.