Asianet News TeluguAsianet News Telugu

సుజనాకి కౌంటర్: బ్యాంకు లూటీల భజన చౌదరి అంటూ రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి

అవినీతి మీద చంద్రబాబు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద దేవినేని ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల రామకృష్ణుడులు లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురించి ప్రెస్‌మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. 
 

ysrcp parliamentary leader vijayasaireddy serious comments on bjp mp sujana chowdary
Author
New Delhi, First Published Nov 22, 2019, 2:53 PM IST

న్యూఢిల్లీ:  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. సుజనా చౌదరికి మతిస్థిమితం లేదంటూ ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ సుజనా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎంపీ సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే బీజేపీ వేరు... అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి తెలిసిందంటూ సెటైర్లు వేశారు. అవినీతి మీద చంద్రబాబు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద దేవినేని ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల రామకృష్ణుడులు లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురించి ప్రెస్‌మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. 

ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని హితవు పలికారు. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే బాగుంటుందన్నారు. సుజనా చౌదరి పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చాడో అన్నీ అర్ధమవుతాయంటూ విమర్శించారు. 

మరోవైపు ఎల్లోమీడియాపైనా విరుచుకుపడ్డారు. సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఎల్లో మీడియా ఇప్పుడు సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. 

గురువారం ప్రెస్మీట్ ను లైవ్‌లో, లైవ్ స్ట్రీమింగ్‌లో మోతెక్కించిందంటే కారణం పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?’ అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.  బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందేనంటూ చెప్పుకొచ్చారు. 

అందువల్లే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరారన్నారు. స్వప్రయోజనాల కోసమే సుజనాచౌదరి బీజేపీలో చేరారంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు విజయసాయిరెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

మేము తలచుకుంటే ఏమౌతావ్, నీకు దమ్ముంటే....: సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీలు ఫైర్

20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం

Follow Us:
Download App:
  • android
  • ios