20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వం టచ్‌లోకి వెళ్లింది.
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలను ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష టీడీపీతో పాటు అధికార వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై కూడ ఆ పార్టీ నాయకత్వం కన్నేసింది.
అధికార వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కూడ బీజేపీ నాయకత్వం టచ్‌లోకి వెళ్లింది. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా కమలదళం పావులు కదుపుతోంది.
Also read:బీజేపీకి టచ్ లో వైసీపీ ఎంపీలు : బాంబు పేల్చిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వం టచ్‌లోకి వెళ్లింది. టీడీపీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు కూడ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు కూడ టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకత్వం కూడ ఆ నేతలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
టీడీపీ నుండి తొమ్మిది కాదు, 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. ఇక వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడ తమతో టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పారు.
తమతో టచ్‌లోకి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలను సమయం, సందర్భం వచ్చినప్పుడు పార్టీలో చేర్చుకొంటామని సుజనా చౌదరి చెప్పారు. తమ పార్టీతో టచ్ లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల వివరాలను ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.
పవన్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడుతున్నారు, తమ పార్టీ నేతలెవరితో పవన్ కళ్యాణ్ టచ్ లోకి వెళ్లారనే విషయం తనకు తెలియదన్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడే పొత్తుల విషయమై తాము వెంపర్లాడడం లేదన్నారు.
also read:ఇంట్రెస్టింగ్: వైసీపీ ఎంపీకి జగన్ క్లాస్, బాగున్నారా అంటూ ఆ ఎంపీ భుజం తట్టిన మోదీ
నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయడం సంస్కారం.... వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును మోడీ ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి పలకరించడాన్ని రాద్దాంతం చేయడం సరైంది కాదని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రధాని మోడీ పలకరించిన విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.