ఉక్కు పరిశ్రమపై బాబుకు చిత్తశుద్ది లేదు: వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి

First Published 16, Jun 2018, 3:42 PM IST
Ysrcp Mp Yv Subbareddy slams on chandrababunaidu
Highlights

బాబుపై వైసీపీ ఎంపీ విమర్శలు


తిరుపతి:ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ఒక్కరోజైనా కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.తిరుపతిలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం నాడు మీడియాతో మాట్లాడారు.

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళనలు ఊపందుకొంటున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మరో వైపు టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఆమరణదీక్షకు సిద్దమౌతున్నారు. ఈ విషయమై టిడిపి తీరుపై వైసీపీ ఘాటుగా స్పందించింది.

కడప ఉక్కు పరిశ్రమ ఇప్పటికే ప్రారంభం కావాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు.ప్రజలను టిడిపి మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. 

ఏపీలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని మరోవైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు.

 చంద్రబాబు అన్నింట్లోనూ విఫలమయ్యారని అన్నారు. తమ పార్టీ మాత్రమే మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని చెప్పారు. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.       

loader