Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబూ! అసలు సినిమా ఇప్పుడే మెుదలైంది: విజయసాయిరెడ్డి

చంద్రబాబు నాయుడు హయాంలో గోదావరి పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ దబాయించారని ధ్వజమెత్తారు. నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  

ysrcp mp vijaya saireddy sensational comments on ex cm chandrababu naidu
Author
Amaravathi, First Published Sep 23, 2019, 1:23 PM IST

అమరావతి ‌: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరించారే తప్ప ఏనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదని విమర్శించారు. 

బోటు ప్రమాదానికి ప్రయివేట్‌ వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం వైఎస్‌ జగన్‌ హుందాగా అంగీకరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు అలా ఏనాడైనా అంగీకరించారా అంటూ నిలదీశారు. 

చంద్రబాబు నాయుడు హయాంలో గోదావరి పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ దబాయించారని ధ్వజమెత్తారు. నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  

సీఎం వైయస్ జగన్ లీడర్ అయితే చంద్రబాబు పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పుకొచ్చారు. దాంతోనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఇకపోతే పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడని ఆరోపించారు. అయితే ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్యాం పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు అవినీతి నుంచి ఎవరి కాళ్లు పట్టుకుని బయట పడాలా అని చంద్రబాబు వెతుకుతున్నాడని విమర్శించారు. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.  

రివర్స్‌ టెండరింగ్‌, జ్యుడిషియల్‌ కమిషన్‌, అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి సాహోసోపేతమైన నిర్ణయాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకుంటున్నారని ప్రశంసించారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, కీలక సంక్షేమ పథకాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. మొదటి సారి సీఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ప్రశంసించారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios