Asianet News TeluguAsianet News Telugu

మంత్రాలకు చింతకాయలు రాలవు... జనాన్ని బెదిరిస్తే ఓట్లు రావు బాబూ: విజయసాయిరెడ్డి విమర్శలు

టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై (chandrababu naidu) వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) విరుచుకుపడ్డారు. గతంలో తాను నిర్మించిన రోడ్లపై నడుస్తున్నారని, ఓటు వేయకపోతే తాట తీస్తానని చంద్రబాబు బెదిరించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు

ysrcp mp vijaya sai reddy slams tdp chief chandrbabu naidu
Author
Amaravati, First Published Nov 11, 2021, 8:04 PM IST

టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై (chandrababu naidu) వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) విరుచుకుపడ్డారు. గతంలో తాను నిర్మించిన రోడ్లపై నడుస్తున్నారని, ఓటు వేయకపోతే తాట తీస్తానని చంద్రబాబు బెదిరించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మంత్రాలకు చింతకాయలు రాలవు... బెదిరిస్తే ఓట్లు రావు బాబూ అంటూ ఆయన హితవు పలికారు. జనం తమను తరిమివేశారన్న ఉక్రోషంతో లోకేశ్ అసభ్య పదజాలంతో వీరంగం వేస్తున్నాడని, రోడ్లపై ఎవరినీ తిరగబోనివ్వమని అంటున్నాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 

అంతకుముందు చేసిన ట్వీట్లలోనూ ఆయన విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఉప్పు-నిప్పులా వ్యవహరించాడని ఆరోపించారు. తను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్లెవరికీ అడ్రెస్ లేదని, చివరికి మోడీ, అమిత్ షా కూడా తనకంటే జూనియర్లేనని హేళన చేశాడని విజయసాయిరెడ్డి వివరించారు. కానీ జగన్ సీఎం అయ్యాక పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం నెలకొందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.

ALso Read:ఏపీలో అంతా ‘‘ ఆఫ్ ద వైసీపీ.. ఫర్ ద వైసీపీ.. బై ద వైసీపీ’’.. వైఎస్ కూడా ఇలా లేరు: జగన్‌పై యనమల ఫైర్

అంతకుముందు ప్రకాశం జిల్లా (prakasam district) నాగులుప్పలపాడులో (naguluppalapadu) రైతులపై లాఠీఛార్జీపై (lathi charge) తెలుగుదేశం పార్టీ (telugu desam party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) స్పందించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు లోకేష్. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు. 

న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం (nyayasthanam to devasthanam) వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో? అని లోకేష్ నిలదీసారు. ''ఎండ‌న‌క‌, వాన‌న‌క  ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధికి పాద‌యాత్ర‌గా వెళ్తుంటే... వారికి సంఘీభావం తెలప‌డ‌మూ నేర‌మా? క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? మహాన్యూస్ ఎండీ వంశీని, పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవ‌డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని లోకేష్ పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios