Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో అంతా ‘‘ ఆఫ్ ద వైసీపీ.. ఫర్ ద వైసీపీ.. బై ద వైసీపీ’’.. వైఎస్ కూడా ఇలా లేరు: జగన్‌పై యనమల ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) మండిపడ్డారు టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (yanamala rama krishnudu) . నియంత పాలనను సాగిస్తున్నారని, ‘ఆఫ్ ద వైసీపీ.. ఫర్ ద వైసీపీ.. బై ద వైసీపీ’ అన్న చందంగా పాలన ఉందని సెటైర్లు వేశారు. ప్రపంచంలో ఏపీ అంటేనే నెగెటివ్ అన్న ముద్ర పడిపోయిందని, కొత్తగా కంపెనీలేవీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని యనమల గుర్తుచేశారు.

tdp senior leader yanamala rama krishnudu slams ap cm ys jagan
Author
Amaravati, First Published Nov 11, 2021, 3:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) మండిపడ్డారు టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (yanamala rama krishnudu) . గురువారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు అన్నీ తాత లక్షణాలు అలవడ్డాయని వ్యాఖ్యానించారు. జగన్‌ పాలనతో ఆంధ్రప్రదేశ్‌కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టమని రామకృష్ణుడు ఎద్దేవా  చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర వృద్ధి రేటు తిరోగమనంలో ఉందని... గతంలో ముఖ్యమంత్రులెవరూ ఇంత దారుణంగా పాలించలేదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని.. కష్టపడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని.. సొంతానికి వాడుకుంటూ ఖూనీ చేస్తున్నారని యనమల విమర్శించారు.

నియంత పాలనను సాగిస్తున్నారని, ‘ఆఫ్ ద వైసీపీ.. ఫర్ ద వైసీపీ.. బై ద వైసీపీ’ అన్న చందంగా పాలన ఉందని సెటైర్లు వేశారు. ప్రపంచంలో ఏపీ అంటేనే నెగెటివ్ అన్న ముద్ర పడిపోయిందని, కొత్తగా కంపెనీలేవీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని యనమల గుర్తుచేశారు. దీని వల్ల రాష్ట్ర యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని... ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదని, జగన్ తండ్రి వైఎస్ కూడా (ys rajasekhara reddy) ఇంత దారుణంగా ప్రవర్తించలేదని యనమల రామకృష్ణుడు అన్నారు. 

Also Read:Amaravati Maha Padayatra: అమరావతి రైతులపై పోలీసుల లాఠీచార్జ్... లోకేష్ సీరియస్

మరోవైపు ప్రకాశం జిల్లా (prakasam district) నాగులుప్పలపాడులో (naguluppalapadu) రైతులపై లాఠీఛార్జీపై (lathi charge) తెలుగుదేశం పార్టీ (telugu desam party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) స్పందించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు లోకేష్. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు. 

న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం (nyayasthanam to devasthanam) వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో? అని లోకేష్ నిలదీసారు. ''ఎండ‌న‌క‌, వాన‌న‌క  ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధికి పాద‌యాత్ర‌గా వెళ్తుంటే... వారికి సంఘీభావం తెలప‌డ‌మూ నేర‌మా? క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? మహాన్యూస్ ఎండీ వంశీని, పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవ‌డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని లోకేష్ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios