ఢిల్లీలో పులి దిగింది, సింహం దిగిందన్నారు ... కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: బాబుపై విజయసాయి సెటైర్లు

టీడీపీ (tdp) అధినేత చంద్ర‌బాబు నాయుడిపై (chandrababu naidu) వైసీపీ (ysrcp) ఎంపీ విజయ‌సాయిరెడ్డి (vijayasai reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు బృందానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) అపాయింట్ మెంట్లు దొరక‌లేద‌న్న విష‌యం తెలిసిందే.

ysrcp mp vijaya sai reddy slams tdp chief chandrababu naidu delhi tour

టీడీపీ (tdp) అధినేత చంద్ర‌బాబు నాయుడిపై (chandrababu naidu) వైసీపీ (ysrcp) ఎంపీ విజయ‌సాయిరెడ్డి (vijayasai reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు బృందానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) అపాయింట్ మెంట్లు దొరక‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ టీడీపీ అధినేతకు విజయ‌సాయిరెడ్డి చుర‌క‌లంటించారు. ఆయనను మీడియా కూడా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.

'ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అడుగు పెట్టగానే పులి దిగింది, సింహం దిగిందంటూ అరుపులు, నినాదాలు చేశారని ఆయన దుయ్యబట్టారు. పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్లు లేవని.. మీడియా పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా దరిచేరనీయలేదని.. హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు అని విజయ‌సాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

Also Read:ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు నిరాశ: భేటీకి ఆసక్తి చూపని అమిత్ షా, కారణం ఇదీ..

చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబేనని.. ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చారా అంటూ మండిపడ్డారు. ఆర్టికల్ 356ని (article 356) రద్దు చేయాలని గతంలో కోరిన చంద్రబాబు ఇప్పుడు అదే కావాలంటున్నారని.. పట్టాభి (pattabhi) బూతుపురాణం వీడియోను రాష్ట్రపతికి ఇచ్చారా అని విజయసాయిరెడ్డి నిలదీశారు. 

చంద్రబాబు 36 గంటల పాటు బూతు దీక్ష చేశారని.. పట్టాభి తిట్లను సమర్ధించుకోవడానికే ఢిల్లీ వచ్చారా అంటూ ఆయన మండిపడ్డారు. అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా... గంజాయి (ganja) వ్యాపారంలో లోకేశ్‌కు (nara lokesh) భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలుసునని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు నాయుడే ఒక టెర్రరెస్టు అని అసాంఘిక శక్తుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడిగితే, ఇవ్వలేదని విజయసాయి దుయ్యబట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభితో తిట్టించారని.. ఆయన వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఆయన చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios