టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉందని చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. గతంలో వచ్చిన సీట్లకు తగ్గకుండా విజయం సాధించి చంద్రబాబు, బీజేపీ‌లకు తగిన బుద్ది చెబుతామని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ సీట్లతో అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయనను ఆయన సింహం అని అనుకుంటారని.. కానీ ఆ సింహం గర్జించే స్థితిలో ఉందని సెటైర్లు వేశారు. 

టీడీపీ అంటే.. తెలుగు దొంగల పార్టీ, తెలుగు డెకాయిట్‌ల పార్టీ అని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం దేశద్రోహానికి కూడా వెనకాడరని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలీసులపై దాడి చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. అసాంఘిక శక్తులకు సపోర్టు చేసే టీడీపీ అసలు పార్టీనే కాదని అన్నారు. టీడీపీ గుర్తును ఎన్నికల సంఘం వెంటనే రద్దు చేయాలని కోరారు. 

చంద్రబాబు అసత్య హరిశ్చంద్రుడు అని విమర్శించారు. చంద్రబాబు గతంలో విజన్ 2020 అన్నారని.. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ఈ విజన్ డాక్యూమెంట్లను రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏపీలో ఇప్పటివరకు ఇళ్లు లేదని.. ఆయనకు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉందన్నారు. అలాంటి చంద్రబాబు ప్రవాస ఆంధ్రుడు అవుతాడని అన్నారు. అలాంటి వ్యక్తిని, ఆ పార్టీని ఎన్నుకోవాల్సి ఉందా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు, లోకేష్‌లు పూనకం వచ్చినట్టుగా మాట్లాడుతూ.. ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. టైమ్స్ నౌ సర్వేలో 25 లోక్‌సభ స్థానాలకు గానూ.. 24 లేదా 25 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని తేలిందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుందని, టీడీపీ అంతర్దానమైపోతుంది విమర్శించారు. ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశంతో.. వాలంటీర్స్, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల కో ఆర్డినేషన్ మీటింగ్ మండల స్థాయిలో నిర్వహించనున్నట్టుగా చెప్పారు.