Asianet News TeluguAsianet News Telugu

అన్ని సీట్లలో పోటీ చేయదట..: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై విజయసాయిరెడ్డి సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో టీడీపీ పోటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

YSRCP MP Vijaya sai reddy Satires On TDP Over Contesting Telangana Assembly Elections ksm
Author
First Published Oct 17, 2023, 5:01 PM IST | Last Updated Oct 17, 2023, 5:01 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 87 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సిద్దం చేశామని.. చంద్రబాబు ఆమోదించాక పేర్లను ప్రకటిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే తెలంగాణలో టీడీపీ పోటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.  తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని కామెంట్స్ చేశారు. 

‘‘తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? 87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది’’ అని విజయసాయిరెడ్డి ఎక్స్‌(ట్విట్టర్)‌ లో పోస్టు చేశారు. 

ఇదిలాఉంటే, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని తెలిపారు. రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో తాను కలిశానని.. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ఆయన వివరించానని చెప్పారు. చంద్రబాబు నాయుడు మంగళవారం జైలు నుంచి బయటకు వస్తాడని తాము ఆశిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన ఉందని అన్నారు.

తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదనే తప్పుడు ప్రచారం జరుగుతుందని.. దానిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 87 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సిద్దం చేశామని.. చంద్రబాబు ఆమోదించాక పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలోని అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ఉంటుందని అన్నారు. తెలంగాణలో టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారని చెప్పారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios