Asianet News TeluguAsianet News Telugu

రఘురామకృష్ణంరాజుపై వేటు.. బాలశౌరీని వరించిన అదృష్టం

వైసీపీ అసమ్మతి నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు పడింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి ఆయనను తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు

ysrcp mp raghurama krishnam raju out from parliament standing committee Post KSP
Author
New Delhi, First Published Oct 16, 2020, 8:46 PM IST

వైసీపీ అసమ్మతి నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు పడింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి ఆయనను తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు.

అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:జగన్ సీఎం పదవి పోయే ప్రమాదం.. రఘురామ రాజు షాకింగ్ కామెంట్స్

రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి కొద్దిరోజుల క్రితం రఘురామకృష్ణంరాజు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది.

ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున ఆయనను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios